: నా పేరును కాదు, 'భారత్' అంటూ నినదించండి : అభిమానులతో విరాట్ కోహ్లీ


‘నా పేరును కాదు ..భారత్ అని నినదించండి’ అంటూ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు సూచించాడు. ఈ సంఘటన బెంగళూరు వేదికగా భారత్-బంగ్లాదేశ్ ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో చోటుచేసుకుంది. బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లిని చూస్తూ అభిమానులు ‘కోహ్లి..కోహ్లి..కోహ్లి’ అంటూ నినాదాలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు స్పందించిన కోహ్లి, ‘కోహ్లి.. కోహ్లి కాదు, భారత్ అని అరవండి’ అంటూ తన టీ-షర్టుపై రాసి ఉన్న ‘ఇండియా’ను చూపిస్తూ అభిమానులకు సూచించాడు. కాగా, కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో కోహ్లి 24 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News