: కన్నయ్యపై చెప్పు విసిరిన వ్యక్తి... సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గందరగోళం!
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నేత కన్నాయి కుమార్ పై ఓ అజ్ఞాత వ్యక్తి చెప్పు విసిరిన ఘటనతో గందరగోళం ఏర్పడింది. ఈ ఉదయం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో ఆయన పాల్గొన్న సమయంలో ఘటన జరిగింది. కన్నయ్య మాట్లాడుతుండగా, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఓ వ్యక్తి, చెప్పు విసిరాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషనుకు తరలించారు. మరింత ఉద్రిక్తత తలెత్తకుండా అదనపు బలగాలను మోహరించారు. చెప్పు విసిరిన వ్యక్తి ఎవరన్న విషయం తెలియాల్సి వుంది.