: మావో జెడాంగ్ రష్యా నేతట!... పొరపాటుపడ్డ తమిళ్ హీరో


చైనాకు చెందిన ప్రఖ్యాత కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్ ను రష్యా నాయకుడంటూ తమిళనటుడు విజయ్ వ్యాఖ్యానించాడు. దీంతో, నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ‘తమిళనాడు రాహుల్ గాంధీ’, ‘వినోదం అందించడంలో విజయ్ పులి లాంటి వాడు, లోకజ్ఞానం విషయంలో ఎలుక’, ‘ఇంకా నయం, మావోను అమెరికా అధ్యక్షుడనలేదు’, ‘విజయ్ లాంటి వారు రోల్ మోడల్ గా ఉండటం అవమానకరం’ అంటూ మొదలైన విమర్శలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఇంతకీ, మావో జెడాంగ్ గురించి ఏ సందర్భంలో విజయ్ ప్రస్తావించాండంటే... తన తాజా చిత్రం ‘తెరీ’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పలు విషయాలను ప్రస్తావించాడు. ఆ తర్వాత మావో జెడాంగ్ గురించి మాట్లాడాడు.

  • Loading...

More Telugu News