: ద్వంద్వార్థాలొచ్చే షో కు రోజా జడ్జిగా ఎలా వెళతారు?: హైకోర్టు న్యాయవాది


‘జబర్దస్త్’ లాంటి ద్వంద్వార్థాలు వచ్చే షోలో ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే రోజా జడ్జిగా ఎలా వెళతారంటూ హైకోర్టు న్యాయవాది చందోలు శోభారాణి విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని కసుకర్రులో ఆమె మాట్లాడారు. రోజా లాంటి వారిని చట్టసభల్లో అడుగుపెట్టనివ్వకూడదని, ఇటువంటి వారు అసెంబ్లీలో ఉంటే ఆడవాళ్లకే కాదు, సమాజానికి కూడా నష్టం వాటిల్లుతుందని ఆమె అన్నారు. కాగా, నగరి ఎమ్మెల్యే రోజాపై ఏడాది సస్పెన్షన్ తీర్మానాన్ని ఎత్తివేస్తూ సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం, దీనిపై ఏపీ సర్కార్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించడంతో ఆ ఉత్తర్వులు చెల్లవని పేర్కొనడం తెలిసిందే.

  • Loading...

More Telugu News