: కిర్లంపూడిలో ముద్రగడ కీలక భేటీ... మంజునాథ కమిషన్ పనితీరుపై సమీక్ష


తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలో నేడు ఓ కీలక భేటీ జరగనుంది. కాపు ఐక్య వేదిక నేత ముద్రగడ పద్మనాభం తన ముఖ్య అనుచరులతో తన సొంతూరైన కిర్లంపూడిలో సమావేశం కానున్నారు. కాపులకు రిజర్వేషన్లతో పాటు కాపు కార్పొరేషన్ కు తక్షణమే రూ.1,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న ముద్రగడ... ఇప్పటికే పలు ఆందోళనలు చేపట్టారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ మంజునాథ కమిషన్ పనితీరుపై నేటి భేటీలో ముద్రగడ సమీక్షించనున్నారు. అనుకున్న మేర కమిషన్ వేగంగా పనిచేస్తే ఓకే, లేదంటే మరోమారు ఆందోళనకు దిగాలన్న భావనతో ముద్రగడ ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నేటి కిర్లంపూడి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News