: కళ్లు తిరిగి పడిపోతున్నాను, బెయిల్ ఇవ్వండి: ఇంద్రాణి ముఖర్జియా
సొంత కూతురు షీనా బోరాను హతమార్చిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా సీబీఐ ప్రత్యేక కోర్టుకు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది. బెయిల్ పిటిషన్ పై తీర్పును కోర్టు ఈ నెలాఖరుకు వాయిదా వేసింది. తన ఆరోగ్యం బాగోలేదని, బలహీనత కారణంగా తాను కళ్లు తిరిగి పడిపోతున్నానని, తనకు బెయిల్ మంజూరు చేస్తే ఆసుపత్రిలో చూపించుకుంటానని ఆ పిటిషన్ లో ఇంద్రాణి పేర్కొంది. కాగా, గత ఫిబ్రవరి లో ఈ బెయిల్ పిటిషన్ ప్రత్యేక కోర్టులో ఆమె తరపు న్యాయవాదులు దాఖలు చేశారు.