: భగత్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి: పంజాబ్ ఉప ముఖ్యమంత్రి
భారత స్వాతంత్ర్య పోరాట యోధుడు భగత్ సింగ్ కు మన దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించాలని పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి త్వరలో ఒక లేఖ రాయనున్నట్లు ఆయన చెప్పారు. ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా భగత్ సింగ్ ను గుర్తుచేసుకున్నారు.