: విజయవాడలో కన్నయ్య సభావేదిక మార్పు
జేఎన్యూ విద్యార్థి కన్నయ్య కుమార్ సభ విజయవాడలో జరగనుంది. ఈ నేపథ్యంలో సభా వేదికగా మొదట సిద్ధార్థ కళాశాలను ఎంచుకున్నారు. అయితే, కళాశాల యాజమాన్యం అందుకు అనుమతించకపోవడంతో సభను ఐవీ ప్యాలెస్ కు మార్చినట్లు ఏఐఎస్ఎఫ్ నేతలు పేర్కొన్నారు. కన్నయ్యకు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలుకుతామని, ఎవరు అడ్డువచ్చినా సభ జరిపి తీరుతామని ఏఐఎస్ఎఫ్ నేత రఘువీరా అన్నారు. కాగా, ఈ సభను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వామపక్షాల తడాఖా చూపిస్తామని సీపీఐ నేత దోనేపూడి శంకర్ హెచ్చరించారు.