: హెచ్సీయూలో లాఠీచార్జిని ఖండిస్తున్నాం: ప్రొఫెసర్ కోదండరాం


హెచ్సీయూలో పోలీసుల లాఠీ చార్జిని ఖండిస్తున్నామని టీ-జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యూనివర్శిటీలోకి పోలీసులు ప్రవేశించరాదని అన్నారు. పోలీసులను తక్షణం బయటకు పంపాలని డిమాండ్ చేశారు. కన్నయ్య పర్యటనలో అధికారులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా టీ-జేఏసీ గురించి ఆయన ప్రస్తావించారు. టీ-జేఏసీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ జేఏసీలోకి కొందరు వెళ్లడం అన్నది వారి వ్యక్తిగతమని, టీ-జేఏసీ కొనసాగుతుందని, త్వరలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. టీ-జేఏసీ ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామని కోదండరాం పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News