: బ్రస్సెల్స్ దాడుల నిందితుడు నజీమ్ అరెస్ట్
బ్రస్సెల్స్ పేలుళ్లలో ప్రధాన అనుమానితుడైన నజీమ్ లాచ్‌రాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు బెల్జియన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. 34 మంది ప్రాణాలు బలిగొని 200 మందిని క్షత్రగాత్రులను చేసిన ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానించారు. ఇందులో ఇద్దరు సోదరులు.. ఖలీద్ ఎల్ బక్రౌలీ, బ్రహీం ఎల్ బక్రౌలీ ఆత్మాహుతి దాడి చేశారు. పరారీలో ఉన్న మూడో నిందితుడు నజీమ్‌ను పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. అయితే నిందితుడు నజీమ్ అరెస్టును ఆ దేశ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.