: అమరావతి కోసం కొత్త విధానం: ప్రకాష్ జవదేకర్
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణం కోసం కొత్త విధానం పాటిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించారు. అటవీ భూముల్లో నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించేందుకు అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, అమరావతి నిర్మాణానికి అనుమతుల విషయంలో ఎంతమాత్రమూ జాప్యం చేయడం లేదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి పూర్తి అనుమతులు వస్తాయని, అందుకు కేంద్రం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. అయితే, నిర్మాణ పనుల్లో అటవీ భూములను సాధ్యమైనంత తక్కువగా వినియోగించుకోవాలని, అడవులను పరిరక్షించేలా రాజధాని ఉండాలని విజ్ఞప్తి చేశామని జవదేకర్ పేర్కొన్నారు.