: విజయన్న చేరిక... వెళ్లిపోయిన 8 మందికి సమానం: జగన్


విపక్ష పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్లను ప్రలోభాలకు గురిచేస్తున్న చంద్రబాబు అత్యంత నీతిమాలిన వ్యక్తని వైకాపా నేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులో ఆనం విజయకుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లాడారు. "వైసీపీ టికెట్ పై గెలిచి ఆపై ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన 8 మందితో ఏర్పడ్డ నష్టం ఒక్క విజయన్న చేరికతో తీరిపోయింది" అన్నారు. తాను దేవుడిని, ప్రజలను నమ్ముకుని ధైర్యంగా ముందుకు సాగుతున్నానని వివరించారు. చంద్రబాబు తానిచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఇప్పటికైనా కదలాలని డిమాండ్ చేశారు. నీచ రాజకీయాలు చేస్తూ, డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను కొంటున్న ఆయన రాజకీయాలు ఎంతో కాలం సాగవని అన్నారు.

  • Loading...

More Telugu News