: ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేటు ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కావాలి: కేంద్రమంత్రి పాశ్వాన్
ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన యువత ప్రైవేటు ఉద్యోగాల్లోనూ కోటా పొందడానికి అర్హత కలిగిన వారని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. రిజర్వేషన్లను కల్పించడం ద్వారా నక్సలిజం వంటి సమస్యలకు కళ్లెం వేయవచ్చని పేర్కొన్నారు. ప్రైవేట్ ఇండస్ట్రీలు ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. నిరుద్యోగ సమస్యతో ఎస్సీ, ఎస్టీ యువకులు తీవ్రవాద భావజాలంవైపు వెళ్తున్నారని, ప్రైవేటు ఉద్యోగాల్లోనూ కోటా ఇస్తే వారిలో ఉన్న అశాంతిని తగ్గించవచ్చని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంనుంచి లబ్ధి పొందుతున్న పరిశ్రమలు, కంపెనీలు కనీసం 3వ తరగతి, 4వ తరగతి సిబ్బంది నియామకాల్లోనైనా రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన సూచించారు. దళితులు అఖిల భారత సర్వీసుల్లోనూ అద్భుత విజయాలు సాధిస్తున్నారని, వారిలో ఎంతో తెలివి ఉందని ఆయన చెప్పారు. ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు.