: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం ఏకం కావాలి: ఒబామా
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ విమానాశ్రయం, మెట్రోస్టేషన్లలో జరిగిన బాంబు దాడులపై క్యూబా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. బెల్జియం దాడులపై ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచం మొత్తం ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. అమాయక ప్రజలపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. బాంబుదాడుల్లో మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమ మిత్రదేశమైన బెల్జియంకు సంఘీభావం తెలుపుతున్నామని, అండగా నిలబడతామని ఆయన చెప్పారు. ప్రపంచ ప్రజల కోసం ఉగ్రవాదులతో తాము పోరాడుతామని ఆయన తెలిపారు.