: బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టులో బెంబేలెత్తించిన పేలని బెల్టుబాంబు
బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టులో పేలని బెల్టుబాంబు అక్కడి అధికారులు, భద్రతా సిబ్బందిని బెంబేలెత్తించింది. బెల్జియం రాజధానిలోని జావెంటం ఎయిర్ పోర్టు, మెట్రోస్టేషన్లలో బాంబుపేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో రంగప్రవేశం చేసిన భద్రతా బలగాలు ఎయిర్ పోర్టును మూసివేసి తనిఖీలు నిర్వహించాయి. ఎయిర్ పోర్టులో జరిపిన తనిఖీల్లో పేలుడు జరిగిన ఐదు గంటల తరువాత పేలని బెల్టుబాంబును భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో ఆత్మాహుతి దాడికి వచ్చిన ఉగ్రవాదులంతా ప్రాణాలు కోల్పోయారా? లేక కొంతమంది పారిపోయారా? అనే అనుమానాలు రేగుతున్నాయని స్థానిక న్యూస్ ఏజెన్సీ అభిప్రాయపడింది. విమానాశ్రయంలో పేలుళ్లలో బెల్జియంలోని టైహాంగ్ న్యూక్లియర్ ప్లాంట్, యూనివర్సిటీ లిబ్రి ది బ్రుకెల్స్ ను ఖాళీ చేయించారు. దీనిపై యూఎల్బీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ, తాజాగా అందిన సమాచారం ప్రకారం యూనివర్సిటీని ఖాళీ చేయాల్సి వచ్చిందని తెలిపింది.