: సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఎంసీఏ విద్యార్థిని ఆత్మహత్య


ఎంసీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని, గుంటూరు జిల్లా ముప్పాళ్ల కు చెందిన చంద్రిక (22) ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణా జిల్లా మైలవరంలోని లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న చంద్రిక బాలికల హాస్టల్ లో ఉంటోంది. ఈరోజు ఆమె కళాశాలకు వెళ్లకుండా హాస్టల్ లోనే గదిలోనే ఉండిపోయింది. ఎవరూ లేని సమయం చూసి, తన చున్నీతో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుంది. ఈరోజు సాయంత్రం కళాశాల నుంచి తిరిగి వచ్చిన విద్యార్థినులు ఈ విషయాన్ని గమనించి, వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చంద్రిక ప్రాణాలు పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం మేరకు మైలవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. అయితే, చంద్రిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News