: గుర్రంపై దాడి చేసి గాయపరిచిన కేసులో ఎమ్మెల్యే జోషికి బెయిల్ మంజూరు
పోలీసు అశ్వక దళానికి చెందిన 'శక్తిమాన్' అనే గుర్రంపై దాడి చేసి గాయపరిచిన కేసులో ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషీకి బెయిల్ మంజూరైంది. 25 వేల బాండ్, సొంత పూచీకత్తుపై ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 14న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్‌రావత్‌కు వ్యతిరేకంగా డెహ్రాడూన్‌లో బీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనలో పోలీసు గుర్రం కాలు విరగ్గొట్టిన బీజేపీ ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. ఆయన మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని వాదించారు. వీడియో సాక్ష్యం ఉన్నప్పటికీ గుర్రాన్ని కొట్టలేదని బుకాయించారు. ఈ క్రమంలో ఆయనను పోలీసులు గత శుక్రవారం డెహ్రాడూన్‌లో అరెస్టు చేశారు