: బ్రసెల్స్ ఉగ్రదాడులతో ఇండియాలో హైఅలర్ట్.. అన్ని విమానాశ్రయాలకు ఐబీ హెచ్చరికలు జారీ
బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో ఇండియాలోనూ హైఅలర్ట్ ప్రకటించారు. నిఘావర్గాల హెచ్చరికలతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు. విమానాశ్రయాలకు సైతం హెచ్చరికలు జారీ చేశారు. రైల్వేస్టేషన్లు, రద్దీలుగా ఉండే ప్రాంతాలలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్, బాంబ్ స్కాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బ్రసెల్స్ ఎయిర్‌పోర్టులో జరిగిన జంట పేలుళ్లలో 17 మంది మృతి చెందారు.