: బ్రస్సెల్స్‌లో మరో పేలుడు.. భయానక వాతావరణం
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో మరో పేలుడు సంభవించింది. అంతర్జాతీయ విమానాశ్రయం బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కొద్ది సేపటికే అక్కడికి దగ్గరలోని మాల్‌బీక్ మెట్రో స్టేషన్‌లోనూ పేలుడు సంభవించింది. దీంతో భద్రతా సిబ్బంది అక్కడున్న ప్రయాణికులను బయటకు పంపించివేశారు. మెట్రో రైలు సేవలను నిలిపివేశారు. భద్రతా బలగాలు ఎయిర్ పోర్టు పరిసరాలను జల్లెడ పడుతున్నాయి. బ్రస్సెల్స్‌లో వరుస పేలుళ్లతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.