: దక్షిణ కొరియాలో జికా వైరస్ తొలి కేసు నమోదు
దక్షిణ కొరియాలో జికా వైరస్ తొలి కేసు నమోదైంది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు అక్కడి వైద్యులు గుర్తించారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న అతను ఇక్కడి ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించడంతో అతనికి జికా వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో అతనికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కాగా, దాదాపు నలభై దేశాల్లో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో జికా వైరస్ పై అత్యవసర పరిస్థితిని డబ్ల్యుహెచ్ఓ ప్రకటించింది.