: ఇకపై ఏ ఎన్నికల్లోను పోటీ చేయం: లోక్ సత్తా అధినేత జేపీ సంచలన నిర్ణయం
తమ పార్టీ తరపున ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోమని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించామని, లోక్ సత్తాను రాజకీయ పార్టీగా చూడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థలకు అధికారాలు, ప్రజా సమస్యలపై పోరాడతామని జేపీ చెప్పారు. కాగా, 2006లో లోక్ సత్తా పార్టీని మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ స్థాపించారు. ప్రజలందరికి రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం సాధన వంటి లక్ష్యాలతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది.