: సోమిరెడ్డి వర్సెస్ సి.రామచంద్రయ్య!... మండలిలో వాదులాడుకున్న సీనియర్లు


నిన్నటిదాకా ఏపీ అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగితే... తాజాగా ఆ తరహా దృశ్యాలకు ఏపీ శాసనమండలి వేదికగా నిలిచింది. నేటి శాసనమండలి సమావేశాల్లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య, టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉచిత ఇసుక విధానంపై కాంగ్రెస్ తో పాటు వైసీపీ చేసిన ఆరోపణలను సోమిరెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక పాలనకు పునాది వేసింది కాంగ్రెస్ సర్కారేనని ప్రతి విమర్శ చేశారు. అప్పటిదాకా కాస్తంత శాంతంగానే కనిపించిన సి.రామచంద్రయ్య ఒక్కసారిగా ఫైరయ్యారు. ఎవరెంత అక్రమాలకు పాల్పడ్డారో తేల్చేందుకు బహిరంగ చర్చకు సిద్దమా? అని ఆయన సోమిరెడ్డికి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన మండలి చైర్మన్ చక్రపాణి ఇద్దరు నేతలకు సర్దిచెప్పారు.

  • Loading...

More Telugu News