: భుజ్ బల్ కు షాకిచ్చిన ఈడీ... రూ.55 కోట్ల ఆస్తులు అటాచ్!


మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్ బల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకుల మీద షాకులిస్తోంది. మహారాష్ట్ర ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) మంత్రి హోదాలో భుజ్ బల్ పలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇప్పటికే ఈడీ ఆయనను విచారణకు పిలిచి అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో భుజ్ బల్ ఇళ్లపై పలుమార్లు దాడులు చేసిన ఈడీ అధికారులు నిన్న ఓ కీలక అడుగు వేశారు. భుజ్ బల్ కుటుంబ ఆధ్వర్యంలోని గిర్నా చక్కెర ఫ్యాక్టరీతో పాటు నాసిక్ జిల్లాలో ఆయన కుటుంబం పేరిట ఉన్న అత్యంత విలువైన భూమిని అటాచ్ చేశారు. అటాచ్ చేసిన షుగర్ మిల్, భూముల విలువ రూ.55 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

  • Loading...

More Telugu News