: నారావారిపల్లెలో హైటెన్షన్!... ఎమ్మార్పీఎస్ యాత్ర వార్తలతో భద్రత కట్టుదిట్టం


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు... చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో మరోమారు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గతంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) చంద్రబాబు సొంతూరు నుంచే విశ్వరూప మహాయాత్రను చేపట్టేందుకు యత్నించిన నేపథ్యంలో గ్రామంలో పోలీసు బలగాలు భారీగా మోహరించిన సంగతి తెలిసిందే. రోజుల తరబడి పోలీసుల పహారాలోని నారావారిపల్లెలో ఇటీవలే ప్రశాంత వాతావరణం నెలకొంది. తాజాగా మరోమారు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆ గ్రామం నుంచే నేడు యాత్రను చేపట్టే అవకాశాలున్నాయన్న వార్తలతో పోలీసులు మరోమారు రంగప్రవేశం చేశారు. గ్రామానికి దారి తీసే అన్ని మార్గాల్లో పికెట్లను ఏర్పాటు చేసిన పోలీసులు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ ఎత్తున బలగాలను మోహరించారు. గ్రామం మీదుగా వెళుతున్న అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత కాని వదలడం లేదు. ఒకేసారి పెద్ద మొత్తంలో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News