: జగన్ కు ఝలక్కిచ్చిన సమీప బంధువు!... టీడీపీలో చేరిన వైఎస్ మేనత్త కొడుకు!
వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా తన పార్టీ టికెట్లపై విజయం సాధించిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఝలక్కివ్వగా, తాజాగా ఆయన సమీప బంధువుల నుంచి కూడా షాకులు ఎదురవుతున్నాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మేనత్త కొడుకు, కడప కార్పొరేషన్ లోని 23వ వార్డు కార్పొరేటర్(వైసీపీ) పీటర్... జగన్ కు ఝలక్కిచ్చారు. నిన్న హైదరాబాదు వచ్చిన ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ‘సైకిల్’ ఎక్కారు. వైఎస్ మేనత్త కొడుకే తన పార్టీలోకి చేరుతుండటంతో చంద్రబాబు స్వయంగా పార్టీ కండువా కప్పి ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు.