: రెండు రోజుల తరువాత తెరుచుకున్న రష్యా విమానాశ్రయం
రష్యాలోని రోస్తావ్ విమానాశ్రయం రెండు రోజుల తరువాత తెరుచుకుంది. దుబాయ్ ఎయిర్ లైన్స్ కి చెందిన బోయింగ్ 737 విమానం 800 మీటర్ల ఎత్తులో మంటలు చెలరేగి ఈ విమానాశ్రయంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో విమానాశ్రయంలోని 1.5 కిలోమీటర్ల రన్ వేపై విమాన శకలాలు పడిపోయాయి. దీంతో విమానాల రాకపోకలు నిలిపేసి, విమానాశ్రయం మూసివేశారు. చెల్లాచెదురుగా పడి ఉన్న శకలాలను పూర్తిగా తొలగించి విమాన రాకపోకలు పునరుద్ధరించారు. కాగా, ఈ విమాన ప్రమాదంలో 62 మంది మరణించగా, వారిలో ఇద్దరు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే.