: ఇస్లామాబాద్, రావల్పిండిలో మొబైల్ సేవలు నిలిపేశారు


పాకిస్థాన్ జంటనగరాలుగా పేర్కొనే ఇస్లామాబాద్, రావల్పిండిల్లో మొబైల్ సేవలు నిలిపేశారు. ఈ నెల 23న కూడా ఈ పట్టణాల్లో మొబైల్ సేవలు నిలిపివేయనున్నామని అధికారులు ప్రకటించారు. 23న పాకిస్థాన్ జాతీయ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ లో పాక్ ఆర్మీ సైనిక పరేడ్ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు మొబైల్ సేవలు నిలిపేశారు. సైనిక పరేడ్ సందర్భంగా బాంబుదాడులు జరిగే అవకాశం ఉందంటూ అంతర్గత భద్రతా సమాచారం ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. మొబైల్ సేవలతోపాటు ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపేసినట్టు వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News