: నిజామాబాద్ జిల్లాలో సుగంధ ద్రవ్యాల పార్క్: సీఎం కేసీఆర్
నిజామాబాద్ జిల్లాలోని పడిగల్ లో సుగంధ ద్రవ్యాల పార్క్ ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పార్క్ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా లేనందున రాష్ట్రమే ఖర్చులు భరిస్తుందని చెప్పారు. ఈ పార్క్ నిర్మాణం నిమిత్తం ఈ ఏడాది రూ.15 కోట్లు, వచ్చే ఏడాది రూ.15.81 కోట్లు ఖర్చు పెడతామని అన్నారు. సుగంధ ద్రవ్యాల పార్క్ నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేస్తామని అన్నారు. ఈ పార్క్ నిర్మాణం పూర్తయితే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వారికి బాసటగా ప్రభుత్వం నిలుస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.