: ఆ పోలీస్ తాగలేదట...విచారణలో తేలిన వాస్తవం!


గత ఆగస్టులో ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేస్తూ ఓ పోలీస్ కానిస్టేబుల్ తూలి పడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పోలీసులంటే ఇంతే' అంటూ పలురకాల వ్యాఖ్యలు చేస్తూ స్పందించారు. దీంతో వెంటనే స్పందించిన ఢిల్లీ పోలీస్ విభాగం ఆ కానిస్టేబుల్ సలీమ్ అని గుర్తించి, వెంటనే సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించింది. అయితే, తాను మద్యం సేవించలేదని పోలీసు బాసులకు విన్నవించడంతో మరోసారి ఆనాటి ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ మద్యం తాగలేదని నిర్ధారించారు. అనారోగ్యం కారణంగా నీరసించిపోగా, గుండెపోటు రావడంతో అలా తూలిపడిపోయాడని తేల్చారు. దీంతో అతనిని విధుల్లోకి తీసుకున్నారు. ఆ వీడియో కారణంగా పోయిన తన పరువుకు నష్టపరిహారం అందజేయాలని కోరాడు. పోయిన పరువు దక్కించుకునేందుకు ఢిల్లీ మెట్రో, పోలీసు శాఖ సహకరించాలని సలీమ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

  • Loading...

More Telugu News