: తెలంగాణ థియేటర్లలో ఇకపై రోజుకు ఐదు షోలు... తెలంగాణ సబ్ కమిటీ నిర్ణయం


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో త్వరలో రోజుకు ఐదు షోల ప్రదర్శన అమలు కానుంది. ఈ పద్ధతిని త్వరలో అమలు చేయాలని తెలంగాణ సబ్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై సబ్ కమిటీ ఆరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో సినీ దర్శకులు దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ, శంకర్, నిర్మాత దగ్గుబాటి సురేష్, సినీనటుడు మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకటం కష్టంగా ఉన్న నేపథ్యంలో 5వ షో ప్రదర్శించే పద్ధతిని ప్రారంభించే విషయమై చర్చించారు. అయితే, ఐదో షోగా ప్రదర్శించేది కచ్చితంగా చిన్న సినిమా అయి ఉండాలని తెలంగాణ సబ్ కమిటీ సూచించింది. చిన్న సినిమాల పరిమితిని 30 నుంచి 50 థియేటర్లకు పెంచుతూ ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. సినీ కార్మికుల నివాసాల కోసం చిత్రపురి కాలనీలో 9 ఎకరాలు కేటాయించాలని, హైదరాబాదులో టీవీ & ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

  • Loading...

More Telugu News