: తిరుగుబాటు చేసిన పార్టీ నేతలపై కొరడా ఝుళిపించిన కాంగ్రెస్


ఉత్తరాఖండ్‌లో రాజకీయ అనిశ్చితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తిరుగుబాటు చేసిన తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ కొరడా ఝుళిపించింది. మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ తనయుడు సాకేత్ బహుగుణపై బహిష్కరణ వేటు వేసింది. అత‌నితో పాటు ప్రధాన కార్యదర్శి, సాకేత్ అనుచరుడు అనిల్ గుప్తాను కూడా బహిష్కరించింది. కాగా, 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు, 28 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్‌ పార్టీనుంచి తిరుగుబాటు చేసిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలకు ఉత్తరాఖండ్‌ శాసనసభ స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు. వారిని సభనుంచి అనర్హులుగా ఎందుకు ప్రకటించరాదో తెలియజేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు రహస్య స్థలానికి వెళ్లిపోవడంతో నోటీసులను వారి నివాసాల వద్ద గేట్లకు అంటించారు.

  • Loading...

More Telugu News