: జేబులో సెల్ ఫోన్ అతన్ని నిలువునా కాల్చేసింది


సెల్లు బిల్లుతోనే కాదు మంటలతో కూడా కాల్చేస్తుందని పాకిస్థాన్ లో చోటుచేసుకున్న ఓ సంఘటన నిరూపించింది. పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లోని ఓ మార్కెట్ లో ఓ వ్యక్తి బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో అతని జేబులోని సెల్ ఫోన్ లోని బ్యాటరీ నుంచి మంటలు వెలువడ్డాయి. ఇవి అంతా చూస్తుండగానే అతని శరీరం మొత్తం కమ్మేశాయి. దీంతో అక్కడ అతనితోపాటు నడుస్తున్నవారు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. ఆ మార్కెట్ లోని ఓ షాపులో వ్యక్తి వేగంగా స్పందించి బకెట్ తో నీళ్లు అతనిపై గుమ్మరించి మంటలు ఆర్పాడు. ఈ తతంగాన్నంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ అయ్యింది. ప్రస్తుతం అతని పరిస్థితిపై సమాచారం అందాల్సిఉంది.

  • Loading...

More Telugu News