: మా వాడు జోడు గుర్రాల స్వారీ చేయగలడు: చిరంజీవి


'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం ఆడియో వేడుక సందర్భంగా మెగా అభిమానుల కేరింతలతో హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణం మారుమోగుతున్న వేళ, మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు పవన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల కొన్ని వార్తలు విన్నానని, కొన్ని చోట్ల చదివానని చెబుతూ, మరో రెండు మూడు చిత్రాల తరువాత తనకు నచ్చిన మార్గంలో వెళ్లేందుకు సినీ పరిశ్రమను వదిలి వెళ్తానని పవన్ అన్నట్టు చిరంజీవి గుర్తు చేసుకున్నారు. "నేను చిన్నప్పుడు చెబితేనే నటుడయ్యాడు. అప్పుడు నా సూచన పాటించిన పవన్ ఇప్పుడూ పాటించాలి. జోడు గుర్రాల మీద స్వారీ చేయగలిగిన సత్తా పవన్ లో ఉంది. వేరేరంగంలో రాణిస్తూనే, సినిమాలు కూడా చేస్తుండాలి. నేను అండగా ఉంటాను" అన్నారు. వేరే రంగమంటే, రాజకీయాలు అనేనని, ఇక అన్నయ్య అండతో, పవన్ రాజకీయాల్లోకి వచ్చి ఓ వెలుగు వెలుగుతారని అభిమానులు సంబరంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News