: తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన టెన్త్ పరీక్షలు


ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప‌దోత‌ర‌గ‌తి వార్షిక పరీక్షలు ప్ర‌శాంతంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ‌లో మొత్తం 2,615 కేంద్రాల్లో 5,67,478 మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌లకు హాజరు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 6,57,595 మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌లు రాస్తున్నారు. నిర్ణ‌యించిన‌ తేదీల్లో ప్ర‌తీరోజు ఉదయం 9:30గంట‌ల‌కు ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌వుతాయి. మొదటి రోజు ఎదుర‌య్యే ప‌లు ఇబ్బందుల‌ దృష్ట్యా పరీక్షకు వచ్చే వారికి అరగంట ఆలస్యమైనా అనుమతించారు. మిగతా రోజుల్లో మాత్రం పరీక్ష ప్రారంభానికి ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఐదు నిమిషాలకు మించి ఆలస్యమైతే పరీక్ష హాల్లోకి అనుమతించబోమ‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News