: తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో అపశ్రుతి!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి తొలి అడుగులో భాగంగా వెలగపూడిలో నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఉదయం పునాదుల పనులు జరుగుతున్న వేళ రిగ్గు మీదపడి ఓ కార్మికుడు మరణించాడు. ఇతను బెంగాల్ నుంచి పొట్ట చేతపట్టుకుని కూలి పనుల కోసం వచ్చిన సామ్రాట్ గా అధికారులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు మొదలు పెట్టారు. ఈ ఘటనతో సచివాలయ పరిసరాల్లో విషాదం నిండింది. కాంట్రాక్టరు సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News