: గోదావరి జలాలతో కాళ్లు కడుగుతామన్న రైతులు... వారించిన కేసీఆర్


తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయంలో నిన్న ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సాగు నీటి పథకాలకు అడ్డుగా ఉన్న పలు సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ ఇటీవలే ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. త్వరలోనే పలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిన్న కరీంనగర్ జిల్లాకు చెందిన కొంతమంది రైతులు గోదావరి జలాలను కలశాల్లో తీసుకుని ర్యాలీగా హైదరాబాదుకు చేరుకున్నారు. నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి తరలివెళ్లారు. అప్పటికే రైతులు గోదావరి జలాలతో తరలివస్తున్నారని తెలుసుకున్న కేసీఆర్, ఇతర మంత్రులు రైతులను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను సింగిల్ ఒప్పందంతో పరిష్కరించేశారని రైతులు కేసీఆర్ ను ఆకాశానికెత్తేశారు. ఇంతటి గొప్ప పనిచేసిన మీ కాళ్లను గోదావరి జలాలతో కడుగుతామంటూ రైతులు కేసీఆర్ వద్దకు వచ్చారు. అయితే, కేసీఆర్ వారిని వారించి గోదావరి జలాలున్న కలశాలను అక్కడి బల్లపై పెట్టించారు.

  • Loading...

More Telugu News