: ‘నోవాటెల్’కు చేరుకున్న పవన్ కల్యాణ్
‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో రిలీజ్ వేడుక జరుగుతున్న నోవాటెల్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొన్ని నిమిషాల క్రితం చేరుకున్నారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో, వారిని అదుపు చేసే విషయంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. దాంతో పవన్ కల్యాణే స్వయంగా తనను చూసేందుకు ఎగబడుతున్న వారిని పక్కకు జరగాలని చెప్పారు. కాగా, ఈ సినిమా హీరోయిన్ కాజల్, ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితర ప్రముఖులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.