: పవన్ అభిమానులు క్షమించాలి, ఆయన్ని ఎక్కువ కష్టపెట్టాం!: ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్


‘పవన్ కల్యాణ్ అభిమానులు మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే, ఈ సినిమాలో ఫైట్స్ కోసం ఆయన్ని ఎక్కువ కష్టపెట్టాం’ అని ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫైట్లు చాలా డిఫరెంట్ గా ఉన్నాయని, ‘గబ్బర్ సింగ్’లో కన్నా ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో ఫైట్లు వందరెట్లు బాగుంటాయని అన్నారు. ఏ ఫైట్ కంపోజ్ చేసినా, అభిమానులను తలచుకుని, వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తామని, ఈ విషయమై పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేకంగా చెప్పేవారని అన్నారు. ఫైట్ల విషయంలో అభిమానులు తన నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేస్తారని, ఫైట్లు డిఫరెంట్ గా ఉండాలని పవన్ కల్యాణ్ తమకు తరచూ చెప్పేవారని రామ్- లక్ష్మణ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News