: శ్రీవారికి గుర్తు తెలియని భక్తుడి అపూర్వ కానుక
తిరుమల శ్రీవారికి గుర్తు తెలియని ఓ అజ్ఞాత భక్తుడు అపూర్వ కానుకను అందించాడు. శ్రీవారి హుండీ లెక్కింపు చేపడుతున్న ఉద్యోగులకు వజ్రాలు పొదిగిన బంగారు శంఖం లభ్యమైంది. ఎవరో భక్తుడు దీన్ని శుక్ర లేదా శనివారాల్లో హుండీలో వేసి వుండవచ్చని తెలుస్తోంది. దీని విలువ రూ. 50 లక్షలకు పైగానే ఉంటుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, గతంలోనూ పేరును వెల్లడించేందుకు ఇష్టపడని అజ్ఞాత భక్తులు ఎందరో శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించిన సంగతి తెలిసిందే.