: కేసీఆర్ సర్కారు ముందు కోదండరాం డిమాండ్లు!


తగ్గిన వర్షాలతో నష్టపోతున్న తెలంగాణ రైతులను ఆదుకోవాలని జేఏసీ నేత కోదండరాం డిమాండ్ చేశారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ మేరకు కొన్ని డిమాండ్లను కేసీఆర్ ప్రభుత్వం ముందు ఉంచారు. రైతులు వేసే ఎటువంటి పంటకైనా బీమా సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని, పశుగ్రాసం కరవైన ప్రాంతంలో ప్రభుత్వమే గడ్డి, తవుడు తదితరాలను అందించాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని, తదుపరి పంట వేసుకునేందుకు వడ్డీ రహిత రుణాలివ్వాలని కోదండరాం కోరారు.

  • Loading...

More Telugu News