: ప్రయాణికుల కోసం 52 ప్రత్యేక రైళ్లు
ఈ వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ నుంచి 52 ప్రత్యేక సువిధ రైళ్లను ఏర్పాటు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు విశాఖ - సికింద్రాబాద్, విశాఖ - తిరుపతి మధ్య తిరుగుతాయని వెల్లడించింది. ప్రతి మంగళవారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు సువిధ రైలు బయలుదేరుతుందని, తిరిగి మరుసటి రోజు బుధవారం సాయంత్రం 4:30 గంటలకు సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళుతుందని, ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకూ ఈ రైళ్లు నడుస్తాయని వివరించింది. విశాఖ, తిరుపతి మధ్య ప్రతి సోమవారం రాత్రి 10:55 గంటలకు, తిరుగు ప్రయాణంలో మంగళవారం రాత్రి 10:55 గంటలకు తిరుపతి నుంచి రైలు బయలుదేరుతుందని, ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకూ ప్రత్యేక రైళ్ల రాకపోకలు ఉంటాయని పేర్కొంది.