: మీడియా వేట ఆపండి... విజయ్ మాల్యాకు మద్దతుగా నిలిచిన కిరణ్ మజుందార్ షా
అరెస్టుకు భయపడి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాను ప్రముఖ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా వెనకేసుకొచ్చారు. ఆయన్ను మీడియా వేటాడుతోందని, దాన్ని ఆపాలని వ్యాఖ్యానించారు. బ్యాంకులకు ఉన్న బకాయిలను తీర్చేందుకు ఆయనకు ఓ అవకాశాన్ని ఇవ్వాలని అన్నారు. మీడియా వేట కారణంగానే ఆయన అపఖ్యాతి పాలయ్యారని అన్నారు. ఆర్థిక పరమైన వివాదాలు ఇండియాలో దీర్ఘకాలం పాటు కొనసాగుతాయని, దేశంలో దివాలా చట్టం లేకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. తన వాదన వినిపించేందుకు మాల్యాకు పారదర్శకమైన అవకాశాన్ని ఇవ్వాలని సూచించారు. మాల్యా తిరిగి ఇండియాకు వస్తారన్న నమ్మకం తనకుందని బయోకాన్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్న ఆమె అన్నారు. మాల్యాపై ఒత్తిడి పెంచినంత మాత్రాన బకాయిలు వసూలు కావని అభిప్రాయపడ్డారు.