: పంజా విసిరిన ఐఎస్ఐఎస్, ఇస్తాంబుల్ లో ఆత్మాహుతి దాడి, ఈజిప్టులో పోలీసులపై ఎటాక్!
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పంజా విసిరారు. పోలీసులు, సాధారణ ప్రజలే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ప్రభుత్వ భవన సముదాయాలున్న ఇస్టిక్ లాల్ ప్రాంతంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిపారు. ఈ ఘటనలో నలుగురు మరణించగా, 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నారు. ఇది తీవ్రవాదుల పనేనని టర్కీ ప్రభుత్వం ఆరోపించింది. మరో ఘటనలో ఈజిప్టు సమీపంలోని సినాయ్ ద్వీపకల్పంలోని ఎల్-ఆరిప్ సమీపంలోని చెక్ పోస్టుపై దాడి చేసిన ఉగ్రవాదులు 13 మంది పోలీసులను హత్య చేశారు. ఈ దాడి తామే చేశామని ఐఎస్ఐఎస్ తెలిపింది. మహిళలను అవమానిస్తూ, సోదాలు చేస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ, ఈ దాడి చేశామని స్పష్టం చేసింది.