: నా డ్రెస్ కు షారూఖ్, రణ్ వీర్, వరుణ్, జాక్వెలిన్ ఫ్యాన్స్ అయ్యారు: పరిణీతి చోప్రా


హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్... ఇలా 'వుడ్' ఏదయినా సినిమా అవార్డు ఫంక్షన్లలో హీరోయిన్లు ధరించే డ్రెస్సులు అందర్నీ ఆకట్టుకుంటాయి. శరీరాన్ని తక్కువ మేర కప్పివుంచే ఈ డ్రెస్సుల మీద సోషల్ మీడియాలో ఎన్నో జోకులు ఉన్నాయి. తాజాగా ముంబైలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పాల్గొంది. ఈ సందర్భంగా పరిణీతి ధరించిన నీలంరంగు లాంగ్ ఫ్రాక్ ఈ ఫంక్షన్ లో పాల్గొన్న చాలా మందిని ఆకట్టుకుంది. 'ఎంత పెద్ద డ్రెస్సో' అంటూ షారూఖ్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆ ఫ్రాక్ ను పట్టుకుని ఆశ్చర్యంగా చూడగా, యువకులైన వరుణ్ ధావన్, రణ్ వీర్ సింగ్ డ్రెస్ గురించి సరదాగా జోకులేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టిన పరిణీతి చోప్రా తన డ్రెస్ కు షారూఖ్, జాక్వెలిన్, వరుణ్, రణ్ వీర్ ఫ్యాన్స్ అయిపోయారంటూ కామెంట్ పెట్టింది. దీనికి అభిమానుల నుంచి విశేషమయిన ఆదరణ లభిస్తోంది.

  • Loading...

More Telugu News