: 2 పరుగుల తేడాతో పాక్ మహిళా జట్టు గెలుపు... ఈడెన్ మ్యాచ్ కాస్త లేట్!


ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా భారత్-పాకిస్థాన్ మహిళ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ అప్పగించిన పాకిస్థాన్ మహిళా జట్టు భారత్ బ్యాట్స్ ఉమన్ ను కట్టడి చేశారు. కట్టుదిట్టమైన బంతులతో, భారత బ్యాట్స్ ఉమన్ ను స్వేచ్ఛగా ఆడనీయకుండా చేసిన పాక్ మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు తీసి 96 పరుగులు ఇచ్చింది. అనంతరం 97 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్థాన్ మహిళా జట్టును భారత మహిళా ఆటగాళ్లు అద్భుతంగా కట్టడి చేశారు. దీంతో 16 ఓవర్లలో పాక్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. ఇంతలో వర్షం కురవడంతో మ్యాచ్ కు అంతరాయం కలిగింది. వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దుచేసిన రిఫరీ...డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్ జట్టును రెండు పరుగుల తేడాతో విజయం సాధించినట్టు ప్రకటించారు. కాగా, కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో టీమిండియా-పాక్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ పిచ్ చిత్తడిగా ఉండడంతో ఆలస్యంగా ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News