: రెండు రోజులుగా అడ్డుకున్నారు... సమావేశానికి రాలేను: ప్రివిలేజ్ కమిటీకి రోజా లేఖ


ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి హాజరుకావాలంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ రోజా మాత్రం హాజరుకాలేదు. హైకోర్టు ఉత్తర్వులు శాసనసభ కార్యదర్శికి అందజేసి, రెండు రోజులుగా సభలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా, తనను అక్కడ అడ్డుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రోజా మండిపడ్డారు. ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి హాజరు కావాలంటూ నిన్నే ఉత్తర్వులు అందజేసి ఈ రోజే హాజరు కావాలంటే ఎలా? అని ఆమె ప్రివిలేజ్ కమిటీని లేఖ ద్వారా ప్రశ్నించారు. అన్యాయంపై పోరాటం చేస్తూ అనారోగ్యానికి గురయ్యానని, ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నానని, ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకాలేనని ఆమె లేఖలో తెలిపారు.

  • Loading...

More Telugu News