: బల నిరూపణకు నేను నేను సిద్ధం: ఉత్తరాఖండ్ సీఎం


ఓ పక్క‌ ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోందని వార్తలు వ‌స్తుండ‌గా మ‌రోప‌క్క‌ తనకు ఇప్పటికీ మెజారిటీ ఉందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ పేర్కొన్నారు. తొమ్మిదిమంది త‌మపార్టీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తోనే ఉండిపోతామని చెప్పారని అన్నారు. బల నిరూపణకు తాను సిద్ధమని రావత్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో త‌మ ఎమ్మెల్యేలందరితో సీఎం రావత్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భాజ‌పా సభ్యులు ఆ రాష్ట్ర గవర్నర్ ను కలిసిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాజకీయాలు ఎటు వైపుకు తిర‌గ‌నున్నాయోనన్న ఆస‌క్తి నెల‌కొంది. సీఎం హరీశ్‌ రావత్‌కు మెజార్టీ లేదని భాజపాతో పాటు, తిరుగుబాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. పదిమంది రెబల్స్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి బీజేపీతో చేతులు కలిపినట్లు వార్తలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News