: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ మహిళా జట్టు...భారత్ బ్యాటింగ్!


ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా భారత్-పాకిస్థాన్ మహిళ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ లో పాకిస్థాన్ మహిళా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించనుంది. కాగా, భారత బ్యాట్స్ ఉమన్ ను కట్టడి చేసి, విజయం సాధించాలని పాకిస్థాన్ వ్యూహం పన్నింది. పాకిస్థాన్ కు అందనంత లక్ష్యాన్ని నిర్దేశించి సెమీస్ లో స్థానం కొల్లగొట్టాలని భారత మహిళా క్రికెట్ జట్టు భావిస్తోంది. కాగా, భారత జట్టులో కీలకమైన మహిళా ఆటగాళ్లంతా ఫాంలో ఉండడం కలిసి వచ్చే అంశం. ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు ఆరుసార్లు రెండు మహిళా జట్లు తలపడగా, భారత్ దే పైచేయిగా నిలిచింది. ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తామని భారత మహిళా జట్టు సభ్యులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News