: 18 ఏళ్లు దాటితే కొడుకుని వదిలేయండి!: గుజరాత్ హైకోర్టు సంచలనాత్మక వ్యాఖ్యలు


పిల్లల పెంపకంపై గుజరాత్ హైకోర్టు సంచలనతీర్పు వెలువరించింది. దినేష్ ఓజా అనే వైద్యుడి విడాకులు కేసు నేపథ్యంలో కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దినేష్ ఓజాకు 2006లో విడాకులు మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా కుమారుడికి 18 ఏళ్లు వచ్చే వరకు అతని పూర్తి బాధ్యతలు తండ్రే చూసుకోవాలని స్పష్టం చేసింది. అప్పటి నుంచి కుమారుడి బాధ్యతలు పంచుకున్న దినేష్ ఓజా అతనికి 18 ఏళ్లు రాగానే చెల్లింపులు నిలిపేశారు. దీంతో అతని మాజీ భార్య 'కుమారుడు ఇంకా సెటిల్ కాలేదని, బాలుడి తండ్రి చెల్లింపులు నిలిపేశాడని' ఆరోపిస్తూ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం...కుమారుడికి 18 ఏళ్లు వచ్చిన తరువాత విడిచిపెట్టేయాలని సూచించింది. ఒకవేళ కుమారుడు శారీరకంగా లేక మానసికంగా బలహీనుడైతే అతని బాధ్యతలు తల్లిదండ్రులే చూసుకోవాలని స్పష్టం చేసింది. అదే కుమార్తె విషయంలో అలా కాదని, ఆమెకు మైనారిటీ తీరినా వివాహం జరిగే వరకు తల్లిదండ్రులే బాధ్యత వహించాలని కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ తల్లిదండ్రులైనా 18 ఏళ్ల వరకు కుమారుడ్ని పెంచి పోషిస్తే చాలని తెలిపింది.

  • Loading...

More Telugu News