: హృతిక్ రోష‌న్, కంగనా ర‌నౌత్‌పై సోష‌ల్ మీడియాలో సెటైర్లు


బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్‌, కంగనా రనౌత్‌ మధ్య గ‌త కొంత కాలంగా వివాదం చెల‌రేగుతోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌లు స‌మాజంలో జ‌రిగే ప్ర‌తీ విష‌యాన్నీ ఫ‌న్నీగా సోష‌ల్ మీడియాలోకి ఎక్కించేస్తుండ‌డం నేటి అల‌వాట్లలో ఒక‌టిగా మారిపోయింది. ఇక హృతిక్ రోషన్‌, కంగనా రనౌత్‌ మధ్య వివాదాన్ని వ‌దులుతారా..! వీరిద్ద‌రినీ కార్టూన్ బొమ్మ‌లుగా చిత్రీక‌రించి.. వారి మ‌ధ్య వివాదాన్ని సోష‌ల్ మీడియాలో ఫ‌న్నీగా పోస్ట్ చేసేస్తున్నారు. హృతిక్ రోషన్‌, కంగనా రనౌత్ క్రిష్‌3 సినిమాలో న‌టించిన విష‌యం తెలిసిందే. క్రిష్ సినిమాలో వీరిద్ద‌రు న‌టించిన‌ పాత్ర‌ల‌తో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సెటైర్లు క‌నిపిస్తున్నాయి. ఫేమ‌స్ అమూల్ పాత్ర‌లో "క్రిష్ అండ్ టెల్" అనే క్యాప్ష‌న్‌తో కంగ‌నా ర‌నౌత్ అంటున్న‌ట్లు, క్రిష్ పాత్రతో వేసిన కార్టూన్‌తో హృతిక్ రోషన్ "నెవ‌ర్ రనౌత్ ఆఫ్ ఇట్" అంటున్న‌ట్లు ఓ పిక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. రెండు నెల‌ల క్రితం హృతిక్ ను ఉద్దేశించి కంగనా 'సిల్లీ ఎక్స్' గా కామెంట్ చేయ‌డం, దానికి హృతిక్ ఘాటుగా స్పందించడం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలు చేసినందుకు తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ హృతిక్ తాజాగా కంగనాకు లీగల్ నోటీసులు పంపాడు. కంగనా కూడా లీగల్ నోటీసులతో హృతిక్‌కు దీటుగా బదులిచ్చింది.

  • Loading...

More Telugu News